భారతదేశం, మే 24 -- Rukmini Vasanth Files Complaint To Cybercrime Police: సినిమా రంగంలో సాంకేతికత ఎంత వేగంగా ఎదుగుతోందో.. అదే స్థాయిలో సెలబ్రిటీల భద్రతకు, వ్యక్తిగత స్వేచ్ఛకు పెద్ద ముప్పుగా మారుతోంది. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలవరపెడుతున్న డీప్‌ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయాజాలానికి మరో యంగ్ హీరోయిన్ బలయ్యారు.

'సప్తా సాగరదాచే ఎల్లో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కాంతార చాప్టర్ 1తో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్. అయితే, తాజాగా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు రుక్మిణి వసంత్.

ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఏఐ సాంకేతికతను ఉపయోగించి రుక్మిణి వసంత్ బికీనీలో ఉన్నట్లు కొన్ని అసభ్యకర ఫోటోలు, వీడియోలను సృష్టించారు. ...