భారతదేశం, జూన్ 20 -- Rukmini Vasanth Bikini Video Case Update: వెండితెర, బుల్లితెర ప్రముఖులను వేధిస్తున్న డీప్‌ఫేక్ ముఠాలపై బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కన్నడ చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ డీప్ ఫేక్ ఫొటోలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

అయితే, రుక్మిణి వసంత్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో అశ్లీల చిత్రాలు, డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించిన వ్యవహారంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్ అనుమతి లేకుండా ఆమె రూపాన్ని అసభ్యకరంగా మార్చేసి సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేయడంతో రుక్మిణి పోలీసులను ఆశ్రయించారు.

సినీ తారల వ్యక్తిగత భద్రతకు, గోప్యతకు డిజిటల్ యుగంలో ఎలాంటి ముప్పు పొంచి ఉందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. గతంలో రష్మిక మందన్నా...