భారతదేశం, ఏప్రిల్ 24 -- తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తోంది. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు చాలా చోట్ల నిరసనలు చేపడుతున్నారు. అయితే నిరసనలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ.. నర్సంపేట బస్టాండ్ ఎదుట శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ఆయనను వరంగల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. 80 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శంకర్ గౌడ్ చనిపోయారు.

కేబినెట్ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. "కార్మికులు ఎవరూ తొందరపడ...