భారతదేశం, జూలై 23 -- రైల్వే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు బిగ్ అప్డేట్! రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్​ఆర్బీ) వివిధ విభాగాల కోసం నిర్వహిస్తున్న టెక్నీషియన్ పోస్టుల రిక్రూట్​మెంట్​ ప్రక్రియకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్​ ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 6,557 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆర్​ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆన్​లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : జూన్ 30, 2026

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జులై 29

దరఖాస్తు రుసుము చెల్లింపుకు చివరి తేదీ: జులై 31

అప్లికేషన్ సవరణ ప్రారంభం: ...