భారతదేశం, మార్చి 9 -- నిరుద్యోగులు, రైల్వేలో ఉద్యోగం పొందాలని చూస్తున్న వారికి బిగ్​ అలర్ట్​! ఆర్​ఆర్బీ (రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు)కి సంబంధించిన గ్రూప్​ డీ రిక్రూట్​మెంట్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ నేటితో, అంటే మార్చ్​ 9, 2026తో ముగియనుంది. ఇంకా అప్లై చేసుకోని వారు అధికారిక వెబ్​సైట్​లో అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఆర్​ఆర్బీ గ్రూప్​ డీ రిక్రూట్​మెంట్​ ప్రక్రియ జనవరి 31న మొదలైంది. వాస్తవానికి రిజిస్ట్రేషన్​ ప్రాసెస్​ ఈ మార్చ్​ 2తో ముగియాల్సి ఉంది. కానీ ఈ గడువును మార్చ్​ 9కి పొడిగించారు. మరి మరోసారి ఈ డెడ్​లైన్​ని ఎక్స్​టెండ్​ చేస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. అధికారిక ప్రకటన లేదు కాబట్టి, ఈరోజే చివరి ఛాన్స్​గా పరిగణించి, వెంటనే అప్లై చేసుకోవడం ఉత్తమం.

ఈ దఫా రిక్రూట్​మెంట్​లో భాగంగా 22,195 గ్రూప్​ డీ పోస్టులను భర్తి చేయనున్నా...