భారతదేశం, అక్టోబర్ 17 -- భారతీయ ప్రీమియం మోటార్‌సైకిల్ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్.. ద్విచక్ర వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకునేలా ఒక అరుదైన బైక్​ని విపణిలోకి తెచ్చింది. కంపెనీ స్థాపించి 125 ఏళ్లు పూర్తయిన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని 'క్లాసిక్ 650 హైపర్‌షిఫ్ట్ 125వ యానివర్సరీ ఎడిషన్' (Classic 650 125th Anniversary Edition)ను అధికారికంగా ఆవిష్కరించింది. భారత మార్కెట్లో ఈ లిమిటెడ్ ఎడిషన్ బైక్ ప్రారంభ ధరను రూ. 4,25,589 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన రీజియన్లలో కేవలం 125 యూనిట్లను మాత్రమే విక్రయించనుండటంతో బైక్ లవర్స్, కలెక్టర్లకు ఇది ఒక అరుదైన కలెక్షన్ మోడల్‌గా నిలవనుంది.

ఈ యానివర్సరీ ఎడిషన్‌లోని ప్రధాన ఆకర్షణ దీని ప్రత్యేకమైన 'హైపర్‌షిఫ్ట్' పెయింట్ ఫినిషింగ్. బైక్‌పై పడే వెలుగు ఆధారంగా ఇది ఎరుపు, ఆకుపచ్చ, బ...