Royal Enfield : రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త 250సీసీ బైక్- తక్కువ బడ్జెట్, అధిక మైలేజ్!
భారతదేశం, నవంబర్ 20 -- దిగ్గజ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి తక్కువ ధరలో, అదిరిపోయే మైలేజీ ఇచ్చే సరికొత్త మోడల్ రాబోతోంది! గతేడాది వార్తల్లో నిలిచి, ఆ తర్వాత కేవలం పుకారుగానే మిగిలిపోయిందనుకున్న '250సీసీ హైబ్రిడ్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది. మీడియా నివేదిక ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఈ ఎంట్రీ-లెవల్ బైక్ను 2027-28 ఆర్థిక సంవత్సరంలో భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. హంటర్ 350 కంటే తక్కువ స్థానంలో నిలిచే ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.20 లక్షల స్థాయిలో ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ల ధరలు రూ. 2 లక్షల మార్కును దాటడం, మైలేజీ లీటరుకు 30 నుంచి 35 కిలోమీటర్లకే పరిమితం కావడంతో సాధారణ మధ్యతరగతి ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు. రోజువారీ ఆఫీసు ప్రయాణాలకు అనువుగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.