భారతదేశం, నవంబర్ 20 -- దిగ్గజ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి తక్కువ ధరలో, అదిరిపోయే మైలేజీ ఇచ్చే సరికొత్త మోడల్ రాబోతోంది! గతేడాది వార్తల్లో నిలిచి, ఆ తర్వాత కేవలం పుకారుగానే మిగిలిపోయిందనుకున్న '250సీసీ హైబ్రిడ్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది. మీడియా నివేదిక ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఈ ఎంట్రీ-లెవల్ బైక్‌ను 2027-28 ఆర్థిక సంవత్సరంలో భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. హంటర్ 350 కంటే తక్కువ స్థానంలో నిలిచే ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.20 లక్షల స్థాయిలో ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు రూ. 2 లక్షల మార్కును దాటడం, మైలేజీ లీటరుకు 30 నుంచి 35 కిలోమీటర్లకే పరిమితం కావడంతో సాధారణ మధ్యతరగతి ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు. రోజువారీ ఆఫీసు ప్రయాణాలకు అనువుగా...