భారతదేశం, సెప్టెంబర్ 17 -- Romantic Web Series: కోలీవుడ్ రొమాంటిక్ డ్రామా లవర్స్‌కు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పేసింది. సుపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ షో రన్నర్‌గా, 'లవ్ ఫెయిల్యూర్' ఫేమ్ బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ ఒరిజినల్ వెబ్ సిరీస్ '#Love' గ్రాండ్ ఓటీటీ ప్రీమియర్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ అయింది.

పవర్‌ఫుల్ వాయిస్‌తో కట్టిపడేసే అర్జున్ దాస్, నేచురల్ యాక్టింగ్‌తో మెప్పించే ఐశ్వర్య లక్ష్మి లీడ్ రోల్స్ చేసిన ఈ మోడరన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ అక్టోబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.

నేటి యూత్ లవ్ లైఫ్, ఆన్‌లైన్ డేటింగ్ కల్చర్‌కు అద్దం పడుతూ ఈ లవ్ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. 'FOUND', 'Find My Bae' అనే రెండు ప్రత్యర్థి డేటింగ్ యాప్స్‌కు ఫౌండర్లుగా ఉండే మ్యాథ్యూ...