భారతదేశం, మార్చి 15 -- తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫామ్​ హౌస్​లో శనివారం రాత్రి వేళ కాల్పుల మోత మోగింది. ఈ ఫామ్​ హౌస్​.. బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్​ రెడ్డికి చెందినది అని పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలియజేసిన సమాచారం ప్రకారం.. ఈ ఫామ్​ హౌస్​ మోయినాబాద్​ అజీజ్​నగర్​ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మద్యం, డ్రగ్స్​ పార్టీ నడుస్తోందని అధికారులకు సమాచారం అందింది. శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఫామ్​ హైస్​పై స్థానిక పోలీసులతో పాటు ఈగల్​ టీమ్​, ఎస్​ఓటీ దాడులు చేశారు. పోలీసులను చూసిన వెంటనే భయంతో చాలా మంది ఉలిక్కిపడ్డారు. వారిలో ఒకరు కాల్పులకు పాల్పడ్డారు.

ఈ పార్టీలో చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వారిలో కొందరి పేర్లను పోలీసులు వెల్లడించారు.

మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి, రియల్​ ఎస్టేట్​ వ్యాపారి నమీద్​...