భారతదేశం, మే 15 -- RJ Balaji: ఎన్నో అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, ఆఖరి నిమిషంలో విడుదల వాయిదా.. వీటన్నింటినీ తట్టుకుని సూర్య నటించిన 'కరుప్పు' (Karuppu) శుక్రవారం (మే 15) థియేటర్లలోకి వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, నటుడు ఆర్జే బాలాజీ చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్ థియేటర్లో ఎమోషనల్ అయ్యారు. ఆయన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన 'జెర్సీ' సినిమాలో నాని తన విజయాన్ని రైల్వే స్టేషన్లో అరుస్తూ సెలబ్రేట్ చేసుకుంటాడు. సరిగ్గా అదే తరహాలో 'కరుప్పు' సినిమాకు థియేటర్లో వస్తున్న స్పందన చూసి బాలాజీ ఆనందంతో అరిచారు. గాల్లోకి పిడికిలి బిగించి, భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న హీరోయిన్ త్రిష, సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్, సూర్య త...