భారతదేశం, మే 12 -- RJ Balaji: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'కరుప్పు' విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సోమవారం (మే 11) హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో దర్శకుడు, నటుడు ఆర్జే బాలాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

హైదరాబాద్ ఈవెంట్‌లో ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. సినిమాను మనస్ఫూర్తిగా ప్రేమించే తెలుగు, తమిళ ప్రేక్షకుల కోసమే ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు.

"కరుప్పు (వీరభద్రుడు) అనేది వెండితెరపై ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. సినిమాను ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరికీ ఇది నచ్చుతుంది. అయితే సోషల్ మీడియాలో కూర్చుని ప్రతి చిన్న విషయాన్ని విశ్లేష...