భారతదేశం, సెప్టెంబర్ 30 -- Rithu Demon Pavan: బిగ్ బాస్ హౌస్‌లోకి సామాన్యుడిగా అడుగుపెట్టి, తన ఆట తీరుతో ఫైనల్ వరకు చేరి విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు డీమాన్ పవన్. అదే హౌస్‌లో రీతూ చౌదరితో అతనికున్న బాండింగ్, కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అభిమానులు వీరిద్దరినీ కలిపి 'రీవాన్' (ReVan - Rithu & Pavan) అని పిలుచుకుంటూ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టారు.

బిగ్ బాస్ సీజన్ 9లో డీమాన్ పవన్, రీతూ చౌదరి పార్టిసిపేట్ చేశారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ల ఫ్రెండ్ షిప్ కొనసాగింది. ఒకరి కష్టసుఖాల్లో మరొకరు తోడుగా ఉన్నారు. కలిసి వ్లాగ్స్ చేశారు. ట్రిప్పులు వేశారు. బీబీ జోడీ 2, కూకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 అనే రియాలిటీ షోలు చేశారు. 'బంగారం' అనే వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేశారు.

డీమాన్ పవన్, రీతూ చౌదరి రిలే...