భారతదేశం, మే 19 -- Rishab Shetty Peddi: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపుదిట్టుకుంటున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. ముంబై వేదికగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసిన ఈ ట్రైలర్‌కు సామాన్య ప్రేక్షకుల నుంచే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి కూడా భారీ ప్రశంసలు దక్కుతున్నాయి.

పెద్ది ట్రైలర్ కు ఫిదా అయిన సెలబ్రిటీల జాబితాలోకి కన్నడ స్టార్ డైరెక్టర్, నటుడు, 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి కూడా చేరిపోయాడు. 'పెద్ది' ట్రైలర్ చూసిన ఆయన, చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు. "పెద్ది ట్రైలర్ అద్భుతంగా ఉంది" అని రిషబ్ శెట్టి తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పేర్కొన్నాడు.

ప్రతి ఫ్రేమ్‌లో రామ్ చరణ్ లుక...