భారతదేశం, మార్చి 13 -- ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2026 ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి కళానిధి మారన్ అత్యంత సంపన్న మూవీ ప్రొడ్యూసర్ గా అగ్రస్థానంలో నిలిచారు. రూ. 26,000 కోట్ల సంపదతో ఆయన బాలీవుడ్ దిగ్గజాలను కూడా వెనక్కి నెట్టారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రభావవంతమైన, అత్యంత సంపన్న వ్యక్తులతో కూడిన వార్షిక బిలియనీర్ల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసింది. 2026 ఏడాదికి గాను ప్రకటించిన ఈ జాబితాలో మొత్తం 4,000 మంది కుబేరులకు చోటు దక్కగా, అందులో భారత్ నుంచి 300 మందికి పైగా ప్రముఖులు ఉన్నారు. అయితే ఈసారి కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి ఒక ఇండియన్ మీడియా మొఘల్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. వరుసగా నాలుగో ఏడాది కూడా ఆయనే భారత్‌లో అత్యంత సంపన్న చిత్ర నిర్మాతగా కిరీటాన్ని...