భారతదేశం, మార్చి 11 -- ప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ మ్యాగజైన్ 'ఫోర్బ్స్' (Forbes) తాజాగా 2026 ఏడాదికి గాను ప్రపంచ బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 4000 మందికి పైగా డాలర్ బిలియనీర్లు చోటు దక్కించుకోగా.. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీలు తమ సత్తా చాటారు.

సాధారణంగా నిర్మాణ సంస్థల అధినేతలు, మ్యూజిక్ లేబుల్ ఓనర్లు ఈ జాబితాలో కనిపిస్తుంటారు. కానీ సినిమాల్లో ఒక్క మెయిన్ లీడ్ రోల్ కూడా చేయకుండానే, కేవలం టెలివిజన్ రంగంపై పట్టుతో ఒక నటి ప్రపంచంలోనే అత్యంత ధనిక నటిగా అవతరించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం రియాలిటీ టీవీ స్టార్, నటి కిమ్ కర్దాషియాన్ (Kim Kardashian) 1.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 17 వేల కోట్లకు పైగా) నికర ఆస్తితో అగ్రస్థానంలో నిలిచింది. కిమ్...