భారతదేశం, నవంబర్ 2 -- Ram Gopal Varma Tweet Raptadu: అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మనుషులు రాక్షసుల్లా మారుతున్నారడానికి ఇదే నిదర్శనమనే కామెంట్లు వస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్ చేశారు.

శనివారం (అక్టోబర్ 31) రాప్తాడు గవర్నమెంట్ స్కూల్ లోకి ఓ దుండగుడు రంపంతో తరగతి గదిలోకి చొరబడి పదో తరగతి విద్యార్థినిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దారుణ ఘటనలో 15 ఏళ్ల బాలిక కుడి చేయి కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా, ఆమెను కాపాడేందుకు యత్నించిన మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. మెరుగైన వైద్యం కోసం బాధిత బాలికను గ్రీన్ కారిడార్ ద్వారా అనంతపురం నుంచి బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ...