భారతదేశం, జూలై 7 -- RGV Satluj Review: సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) ఎవరినైనా పొగిడాడంటే అందులో కచ్చితంగా ఏదో మ్యాటర్ ఉంటుంది. రీసెంట్ గా జీ5 (ZEE5) ఓటీటీలో రిలీజై రెండు రోజులకే బ్యాన్ అయిన దిల్జిత్ దోసాంజ్ 'సట్లెజ్' (Satluj) మూవీపై ఆర్జీవీ చేసిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాను ఎన్ కౌంటర్ చేయొద్దంటూ ఆయన చేసిన అప్పీల్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

పంజాబ్ లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా డైరెక్టర్ హనీ ట్రెహాన్ తెరకెక్కించిన ఈ సట్లెజ్ మూవీ ముందుగా 'పంజాబ్ 95' టైటిల్ తో అనౌన్స్ అయింది. సెన్సార్ బోర్డ్ (CBFC) ఏకంగా 125 కట్స్ చెప్పడంతో థియేట్రికల్ రిలీజ్ వదిలేసి, 'సట్లెజ్' పేరుతో గత శుక్రవారం జీ5 ఓటీటీలోకి సైలెంట్ గా తెచ్చారు. కానీ ఆదివారం సాయంత్రానికే ఈ మూవీని ఇండియాలో బ్యాన్ చేసి యాప్ న...