భారతదేశం, జూలై 12 -- RGV Lenin Review: టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అక్కినేని అఖిల్, డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరి కాంబినేషన్‌లో వచ్చిన 'లెనిన్' (Lenin) చిత్రానికి ఊహించని రేంజ్‌లో సెలబ్రిటీ సపోర్ట్ లభిస్తోంది. సాధారణంగా ఏ సినిమానైనా, ఏ నటుడినైనా అంత సులభంగా మెచ్చుకోని కల్ట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. అఖిల్ నటనకు ఫిదా అయిపోయి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఫిలిం నగర్ సర్కిల్స్‌ను షేక్ చేస్తున్నాయి.

లెనిన్ సినిమా చూసిన వెంటనే ఆర్జీవీ ఎక్స్‌లో నేరుగా అఖిల్‌ను ట్యాగ్ చేస్తూ ఒక పవర్‌ఫుల్ నోట్ రాశాడు. " అఖిల్.. నేను ఇప్పుడే 'లెనిన్' సినిమా చూశా. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఇది పక్కన పెడితే, అక్కినేని ఫ్యామిలీ మొత్తంలోనూ నువ్వే బెస్ట్ యాక్టర్‌వి అని నాకు అర్థమైంది. ఈ విషయాన్ని నేను నాగార్జున మీద ఒట్టు వేసి మరీ చెప్తున్నా" అని రామ్ గోపాల్...