భారతదేశం, జూన్ 7 -- Ram Gopal Varma Review On Obsession Movie: ఇటీవల కాలంలో భారీ తారాగణం, వందల కోట్ల బడ్జెట్, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకాన్ని ఒక చిన్న హారర్ సినిమా ముక్కలు చేసేసింది.

కేవలం 750,000 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 7 కోట్లు) అత్యల్ప బడ్జెట్‌తో రూపొందిన హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' (Obsession) ప్రపంచవ్యాప్తంగా ఏకంగా $170 మిలియన్లు (దాదాపు రూ. 1400 కోట్లకు పైగా) కలెక్షన్స్ వసూలు చేసి అంతర్జాతీయంగా ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

అబ్సెషన్ సినిమా సృష్టించిన సంచలనంపై ఇండియన్ సినిమా ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనకు ఈ సినిమా విపరీతంగా నచ్చేసిందని చెప్తూ, ఈ చిత్రం గ్లోబల్ ఆడియన్స్‌కు ఎలా కనెక్ట్ అయిందో విశ్ల...