భారతదేశం, మార్చి 14 -- సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'తో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన దర్శకుడు ఆదిత్య ధర్‌పై ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపిస్తూనే, సినీ పరిశ్రమలోని చీకటి కోణాన్ని బయటపెట్టారు.

ఆదిత్య ధర్ ఎదుగుదల చూసి ఇండస్ట్రీలో చాలామంది అసూయతో రగిలిపోతున్నారని, ఆయన, అతని భార్య యామీ గౌతమ్ ఎప్పుడు ఫెయిల్ అవుతారా అని అందరూ కాచుకుని కూర్చున్నారని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ.. "ఆదిత్య ధర్ సినిమా బిజినెస్‌ను ఎంతలా ప్రభావితం చేశారో మీరు అర్థం చేసుకోవాలి. ఆయన వెండితెరపై కథ చెప్పే విధానాన్ని (గ్రామర్) పూర్తిగా మార్చేశారు" అని అన్నారు.

"హిందీలోనే కాదు, ఇకపై ఏ భాషలోనూ సినిమాలు పాత పద్ధతిలో ఉండవు. ఆదిత్య సృష్టించిన బ...