భారతదేశం, మార్చి 20 -- పాపులర్ ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సెన్సేషన్ ధురంధర్ 2 ది రివెంజ్ సినిమాను మరోసారి పొగుడుతూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. డైరెక్టర్ ఆదిత్య ధర్ తీసిన ఈ సీక్వెల్ ఆడియన్స్ టేస్ట్‌ను పూర్తిగా మార్చేసిందని, ఇక రొటీన్ ఫార్ములా డ్రివెన్ బాలీవుడ్ సినిమాలకు కాలం చెల్లినట్లే అని వర్మ డిక్లేర్ చేశాడు.

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ తన అభిప్రాయాలను ఏమాత్రం ఫిల్టర్లు లేకుండా చెప్తుంటాడు. ఇప్పుడు కూడా ధురంధర్ 2 మూవీని పొగుడుతూ.. మసాలా సినిమాలు తీసే డైరెక్టర్లను ఏకిపారేశాడు. అలాంటి డైరెక్టర్లకు ఈ మూవీ ఓ హారర్ అని అన్నాడు.

ట్రెడిషనల్ హీరో సెంట్రిక్ స్టోరీల్లో ఉన్న వీక్‌నెస్‌ను ధురంధర్ 2 బయటపెట్టిందని చెప్పాడు. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టిన ఒక పెద్ద పోస్ట్‌లో బాలీవుడ్‌లో ఎప్పట్నుంచో ఉన్న ఓటమెరగని హీరోల కాన్సెప్ట్‌ను వర్మ గట్టి...