భారతదేశం, జూన్ 12 -- RGUKT Basar Selection List 2026 :రాష్ట్రంలోని సాంకేతిక విద్యా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బాసర ఐఐఐటీ ప్రవేశాలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఫేజ్ - 2 మెరిట్ లిస్ట్ విడుదలైంది. ఈ జాబితాను అధికారిక వెబ్ సైట్ లో ఉంచినట్లు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.టెక్ (B.Tech) కోర్సులో అడ్మిషన్లు కల్పిస్తారు. ఇప్పటికే మొదటి దశ కౌన్సెలింగ్ ముగిసింది. ఇందులో మిగిలిపోయిన సీట్లతో పాటు, పెరిగిన సీట్ల భర్తీ కోసం ఈ విడత ఎంపిక జాబితాను రూపొందించారు. ఈ ప్రొవిజనల్ ఎంపికలో చోటు దక్కించుకున్న విద్యార్థులు రెండు క్యాంపస్‌లలో దేనికి ఎంపికయ్యారనే పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఫేజ్-2 లో సీటు సాధించిన విద్యార్థులు నిర్దేశిత గడువు లోపు ఆయా క్యాంపస్‌లలో ఒరిజిన...