భారతదేశం, జూన్ 5 -- బాసర రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు ప్రవేశాలకు సంబంధించి కీలక అప్‌డేట్ విడుదల చేసింది. మొదటి విడత ఎంపికల జాబితాలో చోటు దక్కించుకున్న విద్యార్థులకు ఇవాళ్టి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నిర్దేశిత తేదీలలో బాసర క్యాంపస్‌కు నేరుగా హాజరై తమ ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకోవాలని వర్సిటీ అధికారులు సూచించారు.

మెరిట్ జాబితాలోని అభ్యర్థుల సీరియల్ నంబర్ల ఆధారంగా మూడు రోజుల పాటు ఈ కౌన్సెలింగ్ సదుపాయాన్ని కల్పించారు. ఏ రోజు ఏయే నంబర్ల వారికి కౌన్సెలింగ్ ఉంటుందనే పూర్తి షెడ్యూల్ వివరాలను అధికారులు ప్రకటించారు.

పైన పేర్కొన్న అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, వాటికి సంబంధించిన రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను కూడా సిద్ధం చేసుకుని కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ఆర్జీయ...