భారతదేశం, అక్టోబర్ 22 -- ఉద్యోగ విరమణ చేయగానే పెట్టుబడుల నిర్వహణ విధానం పూర్తిగా మారిపోతుంది. ఉద్యోగంలో ఉన్నంతకాలం సంపదను పెంచుకోవడం ప్రధాన లక్ష్యం కాగా, రిటైర్మెంట్ తర్వాత మాత్రం సమకూరిన కార్పస్‌ను కాపాడుకోవడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడం అత్యంత కీలకంగా మారుతుంది.

60 ఏళ్ల వయస్సులో రిటైర్ అయ్యే వ్యక్తి మరో 20 నుంచి 30 ఏళ్ల పాటు జీవించే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సుదీర్ఘ కాలంలో మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకుంటూ, రోజువారీ ఖర్చులను నెట్టుకురావడానికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు లేదా స్టాక్స్‌లో ఎంత శాతాన్ని కొనసాగించాలి? పర్సనల్ ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్ 'ఫ్రీఫిన్‌కాల్' (Freefincal) వ్యవస్థాపకుడు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం పట్టాభిరామన్ దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలను అందించారు.

ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలామంది తమ పోర్ట్‌ఫోలియోలో 50 ...