భారతదేశం, అక్టోబర్ 10 -- Reporting Live Review: బాలీవుడ్ టాలెంటెడ్ నటి పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న తాజా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'రిపోర్టింగ్ లైవ్'. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా విడుదలైన ఈ చిత్రానికి ధ్రువ్ త్రిపాఠి దర్శకత్వం వహించారు. సమాజంలో పేరుకుపోయిన అవినీతిని, ఇసుక మాఫియా అరాచకాలను ఎండగట్టే సాహసోపేతమైన జర్నలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ రూపొందింది. ప్రముఖ తమిళ నటుడు నాజర్ విలన్ గా నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.

రిపోర్టింగ్ లైవ్ మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకే అడుగుపెట్టింది. శుక్రవారం (అక్టోబర్ 9) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం హిందీ ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తోనే అందుబాటులోకి వచ్చింది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పవరేంటో చూపిం...