భారతదేశం, సెప్టెంబర్ 25 -- Renu Desai: వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకల్లో రాత్రిపూట డీజే సౌండ్స్ పై కామెంట్ చేసి తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొన్న నటి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తనపై బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. మన ధర్మం గురించి తానెప్పుడూ నెగెటివ్‌గా మాట్లాడనని, అసలు తాను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

"మన సనాతన ధర్మం గురించి నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడను. గణపతి బప్పాకి నాకంటే పెద్ద భక్తురాలు ఎవరూ ఉండరు" అని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. అయితే పండగ పేరుతో రాత్రి 12 గంటల సమయంలో మందు తాగి, విపరీతమైన మాస్ పాటలకు అసభ్యంగా డాన్స్ చేయడం మన ధర్మం లేదా సంస్కృతి నేర్పించిన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశార...