భారతదేశం, ఏప్రిల్ 6 -- Renu Desai: ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని విప్పింది. గత కొంతకాలంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని కొందరు నెటిజన్లు చేస్తున్న అసభ్యకర కామెంట్లను ఆమె తీవ్రంగా ఖండించింది. భావ ప్రకటన స్వేచ్ఛకు, వ్యక్తిగత దూషణకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలని ఆమె ఘాటుగా విమర్శించింది.

తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసిన రేణు దేశాయ్.. "కళాకారులంటే మీ దృష్టిలో నేరస్తులా లేక ఉగ్రవాదులా? అంత దారుణమైన పదజాలంతో దూషించడానికి వారేం తప్పు చేశారు?" అని ప్రశ్నించింది.

ఒక వ్యక్తి చేసే పని లేదా వారు చెప్పే మాటలు మీకు నచ్చకపోతే, సింపుల్‌గా వారిని అన్‌ఫాలో చేసి మీ దారి మీరు చూసుకోవాలి తప్ప.. ఇలాంటి నీచమైన మాటలు అనడం సంస్కారం కాదని ఆమె హితవు పలికింది.

"నిజంగానే మర...