భారతదేశం, ఏప్రిల్ 17 -- Renault Duster 2026 : డస్టర్ ఎస్యూవీ లాంచ్‌తో మంచి జోరు మీదున్న రెనాల్ట్ సంస్థ.. భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన ఉనికిని పెంచుకునేందుకు భారీ ప్రణాళికే రచించింది! 'ఫ్యూచర్ రెడీ ఇండియా' రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఏకంగా ఏడు కొత్త కార్లను దేశీయ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
ముఖ్యంగా రూ. 10 లక్షల లోపు బడ్జెట్ సెగ్మెంట్‌పై కన్నేసిన రెనాల్ట్, ఈసారి మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి అగ్రగామి సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
రెనాల్ట్ తన భవిష్యత్తు కార్లను రెండు ప్రధాన ప్లాట్‌ఫామ్‌లపై నిర్మిస్తోంది:
1. రెనాల్ట్ గ్రూప్ ఎంట్రీ ప్లాట్‌ఫామ్ (ఆర్జీఈపీ)
ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రధానంగా రూ. 10 లక్షల లోపు ధర ఉండే కార్ల కోసం కేటాయించారు. ప్రస్తుతం ఈ విభాగంలో రెనాల్ట్ వద్ద క్విడ్, ట్రైబర్, కైగర్ వంటి మోడల్స్ ఉన్నాయి....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.