భారతదేశం, అక్టోబర్ 22 -- భారత మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం 'రెనాల్ట్' తన అత్యంత ప్రాచుర్యం పొందిన డస్టర్ మోడల్​లో స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్​ను ఇటీవలే లాంచ్ చేసింది. దేశీయ ఆటో ప్రియులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ 'డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్' ప్రారంభ ధరను కంపెనీ రూ.16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.

గతంలో భారత రోడ్లను ఏలిన డస్టర్ బ్రాండ్.. ఇప్పుడు అత్యంత ఆధునిక హైబ్రిడ్ పరిజ్ఞానంతో పునరాగమనం చేయడం మార్కెట్ వర్గాల్లో హాట్​ టాపిక్​గా మారింది. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలకు కస్టమర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఇప్పటికే పాపులర్ అయిన మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి మోడళ్లక...