భారతదేశం, సెప్టెంబర్ 3 -- పదేళ్ల క్రితం, అంటే 2016 సెప్టెంబర్ 5కు ముందు భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వాడకం అనేది ఒక లగ్జరీ విషయంగా పరిగణించాల్సి వచ్చేది. ఇక ఆ స్మార్ట్​ఫోన్స్​లో ఒక్క మెగాబైట్ డేటా కూడా వృథా కాకూడదని వినియోగదారులు పడిన ఆరాటం అంతా ఇంతా కాదు! వీడియోలు చూడటం, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు చేయడం అనేది సామాన్యుడికి పెద్దగా పరిచయం లేని విషయాలు.

ఆనాటి క్లిష్ట పరిస్థితులు గణాంకాలను పరిశీలిస్తే మరింత అర్థమవుతాయి. 2016లో ఒక భారతీయుడు నెలకు సగటున వాడిన డేటా కేవలం 0.2 జీబీ (200 ఎంబీ) కంటే తక్కువ! పైగా ఒక్క జీబీ డేటా ధర సుమారు రూ. 228గా ఉండేది. దేశమంతటా కలిపి 4జీ వాడుతున్న వారి సంఖ్య కోటి కంటే తక్కువే. ఇంటర్నెట్ వేగం సగటున 2.5 ఎంబీపీఎస్ దాటడానికి ముప్పుతిప్పలు పడేది.

అప్పుడొచ్చింది రిలయన్స్ జియో! ఈ పాత వ్యవస్థ పునాదులను కదిలించేసి, అనేక సంచలనాల...