భారతదేశం, ఆగస్టు 23 -- భారతీయ రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం రెండు ముఖ్యమైన వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను క్రమబద్ధీకరించి క్రమం తప్పకుండా నడపాలని నిర్ణయించింది. లాల్‌కువాన్ - బెంగళూరు సిటీ, అహ్మదాబాద్-తిరుచిరాపల్లి మార్గాల్లో నడిచే ఈ రైళ్లను రెగ్యులరైజ్ చేసినట్టుగా వెల్లడించింది. ఆగే స్టేషన్ల వివరాలను కింద తెలుసుకోవచ్చు.

ఈ రైలు ఉత్తరాఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. రైలు నంబర్ 15302 (లాల్‌కువాన్ - బెంగళూరు) సెప్టెంబర్ 19, 2026 నుండి అందుబాటులోకి వస్తుంది (మినహాయింపు తేదీలు: సెప్టెంబర్ 26, అక్టోబర్ 03 మరియు అక్టోబర్ 10). రైలు నంబర్ 15301 (బెంగళూరు - లాల్‌కువాన్) సెప్టెంబర్ 22, 2026 నుండి అందుబాటులోకి వస్తుంది (మినహాయింపు తేదీలు: సెప్టెంబర్ 29, అక్టోబర్ 06 మరియు అక్టోబర్ 13).

కిచ్చా, సిర్పూర్ కాగజ్‌నగర...