భారతదేశం, నవంబర్ 5 -- Regina Cassandra: సౌత్ ఇండియన్ సినిమాలపై బాలీవుడ్ తారలు తరచుగా చేస్తున్న కామెంట్స్‌పై టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన నటీనటులు, ప్రేక్షకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటీవల 'పెద్ది' సినిమా వివాదంలో జాన్వీ కపూర్.. "సౌత్‌లో బౌండ్ స్క్రిప్టులు ఉండవు" అని చేసిన వ్యాఖ్యలు, అలాగే రాధికా ఆప్టే సౌత్ సినిమా కల్చర్‌పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.

మహాశక్తి (మూకుతి అమ్మన్ 2) సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ పై రెజీనా కసాండ్రా ఫైర్ అయింది. ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై రెజీనా ఘాటుగా స్పందించింది. ఉత్తరాది నటీనటులు కావాలనే ఇలాంటి విభేదాలు సృష్టిస్తున్నారని ఆమె ఫైర్ అయింది.

జాన్వీ కపూర్, రాధికా ఆప్టే వ్యాఖ్యలను తిప్పికొడుతూనే, బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌పై రెజీనా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. "నార్త్ ఇ...