భారతదేశం, నవంబర్ 17 -- ఈ ఏడాది ఆరంభంలోనే రెడ్‌మీ నోట్ 17 సిరీస్‌ను మార్కెట్లోకి తెచ్చిన చైనా టెక్ దిగ్గజం షావోమీ, ఇప్పుడు తదుపరి తరం 'రెడ్‌మీ నోట్ 18' సిరీస్‌తో మిడ్-రేంజ్ విభాగాన్ని మరింత విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. తాజాగా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఒక లీక్ ద్వారా స్టాండర్డ్ రెడ్‌మీ నోట్ 18 5జీ బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ వేగం వివరాలు బయటకు వచ్చాయి. చైనాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలయ్యే వేరియంట్లలో బ్యాటరీ మార్పులు ఎలా ఉండబోతున్నాయో ఈ లీక్ స్పష్టం చేస్తోంది. ఈ కొత్త లైనప్‌లో స్టాండర్డ్ మోడల్‌తో పాటు రెడ్‌మీ నోట్ 18 ప్రో, రెడ్‌మీ నోట్ 18 ప్రో మ్యాక్స్ ఫోన్లు కూడా రానున్నాయని సమాచారం.

ఎక్స్ వేదికగా ప్రముఖ టిప్‌స్టర్ 'పేపర్‌కింగ్13' వెల్లడించిన వివరాల ప్రకారం.. రాబోయే రెడ్‌మీ నోట్ 18 5జీ ఫోన్ ప్రస్తుత రెడ్‌మీ నోట్ 17 5...