భారతదేశం, మార్చి 16 -- ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం 'రియల్‌మీ'.. భారతీయ మొబైల్ మార్కెట్​ కోసం సరికొత్త అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రజాదరణ పొందిన రియల్‌మీ 16, పీ4-సిరీస్ లైనప్‌లను మరింత విస్తరిస్తూ, రెండు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ (@yabhishekhd) ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్న సమాచారం ప్రకారం.. ఈ ఫోన్లు 'రియల్‌మీ 16టీ 5జీ', 'రియల్‌మీ పీ4ఆర్​ 5జీ' పేర్లతో మార్కెట్లోకి రానున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్స్​కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టిప్‌స్టర్ అందించిన వివరాల ప్రకారం.. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​ వరుసగా RMX5268, RMX5266 మోడల్ నంబర్లతో డిటెక్ట్​ అయ్యాయి. వీటి ఖచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా వెల...