భారతదేశం, ఫిబ్రవరి 16 -- సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో సొంత ఇల్లు అనేది ఒకప్పుడు మధ్యతరగతి ప్రజల కల. కానీ నేడు అనేక ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ ధరలు రూ. 2 కోట్ల మార్కును దాటేయడంతో, ఆ కల సాకారం చేసుకోవడం సవాలుగా మారింది. ఈఎంఐ భారం, పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య అసలు ఎంత ఆదాయం ఉంటే రూ. 2 కోట్ల ఇంటిని భరించగలమనే చర్చ ఇప్పుడు ఎక్స్​ (ట్విట్టర్), రెడ్డిట్ వంటి వేదికలపై జోరందుకుంది. మీరు ఒకవేళ బెంగళూరులో ఇల్లు కొనాలని ప్లాన్​ చేస్తుంటే, ఈ ప్రశ్నకు నిపుణుల సమాధానాన్ని ఇక్కడ తెలుసుకోండి..

ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ సురేష్ సద్గోపన్ అభిప్రాయం ప్రకారం.. ఇంటి కొనుగోలుదారులు కేవలం ఇంటి స్టిక్కర్ ధరను మాత్రమే చూడకూడదు.

ఆదాయంలో సగం ఖర్చు: ఇంటి ఈఎంఐ, నెలవారీ జీవన వ్యయాలు కలిసి కుటుంబ ఆదాయంలో 50శాతం మించకూడదు.

ఈఎంఐ లెక్క: ఒకరు రూ. 1.6 కోట్ల లోన్ ...