భారతదేశం, మార్చి 28 -- ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్‌గా వచ్చేసింది. ఈరోజే అంటే మార్చి 28 శనివారం నాడు జరిగే ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఎం చిన్నస్వామి స్టేడియంలో తలపడబోతున్నాయి. 19వ సీజన్‌గా వస్తున్న ఈ టీ20 టోర్నీతో మన కింగ్ విరాట్ కోహ్లీ మళ్లీ కాంపిటేటివ్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత విరాట్ ఆడుతున్న ఫస్ట్ టోర్నీ ఇదే. సౌతాఫ్రికా, కివీస్‌తో జరిగిన గత రెండు సిరీస్‌లలో గ్రౌండ్ నలువైపులా షాట్లు కొట్టి అదరగొట్టిన కోహ్లీ.. అదే ఫామ్‌ను ఈ రాబోయే టోర్నీలోనూ కంటిన్యూ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.

ఈ ఐపీఎల్ 2026 ఓపెనింగ్ మ్యాచ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆర్సీబీ స్...