భారతదేశం, మార్చి 28 -- ఐపీఎల్ 2026 సరికొత్త సీజన్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఇషాన్ కిషన్ మొదటి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరుకు సన్‌రైజర్స్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.

సన్‌రైజర్స్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్.. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 38 బంతుల్లోనే 13 బౌండరీలతో 80 పరుగులు సాధించి జట్టుకు బలమైన పునాది వేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కిషన్ ఏమాత్రం తగ్గకుండా దూకుడుగా ఆడాడు.

అయితే 16వ ఓవర్లో ఫిలిప్ సాల్ట్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో కిషన్ ఇన్నింగ్స్ మ...