భారతదేశం, ఏప్రిల్ 25 -- IPL match RCB vs GT : ఐపీఎల్ 2026లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ జోరు కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగి, అరుదైన మైలురాళ్లను అధిగమించాడు. అంతేకాకుండా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుకు కీలక విజయాన్ని అందించాడు.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ పోరులో విరాట్ కోహ్లీకి ఆరంభంలోనే అదృష్టం కలిసి వచ్చింది. మహ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే వాషింగ్టన్ సుందర్ చేతికి చిక్కిన కోహ్లీ.. గోల్డెన్ డక్ అయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. సుందర్ ఆ క్యాచ్‌ను వదిలేయడం గుజరాత్ జట్టుకు భారీ మూల్యంగా మారింది.

ఆ తర్వాత కోహ్లీ వెనుదిరిగి చూడలేదు. 206 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోహ్లీ తనదైన శైలిలో గేర్లు మారుస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మై...