భారతదేశం, ఏప్రిల్ 16 -- RCB vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య పోరు మైదానంలోనే కాదు.. ఇప్పుడు బోర్డు వరకు వెళ్లింది. ఏప్రిల్ 5న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా తమను కించపరిచారని, అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఫిర్యాదు చేసింది.

ఏప్రిల్ 5న సీఎస్కే, ఆర్సీబీ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం డీజే 'దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ, చట్నీ' అనే పాటను ప్లే చేయడం వివాదానికి కేంద్రబిందువైంది. గానా అప్పు కంపోజ్ చేసిన ఈ పాట సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. అయితే దీన్ని మీమ్స్‌లో ఎక్కువగా వాడుతుంటారు.

ముఖ్యంగా సీఎస...