భారతదేశం, ఫిబ్రవరి 7 -- మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి జైత్రయాత్రను కొనసాగించింది. వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీని ముద్దాడింది ఆర్సీబీ. ఈ చారిత్రాత్మక విజయంలో కెప్టెన్ స్మృతి మంధాన (41 బంతుల్లో 87 పరుగులు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది.

ఈ విజయం వెనుక స్మృతి అంకితభావం ఎంత ఉందో తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఫైనల్ మ్యాచ్‌కు ముందు రోజు స్మృతి మంధాన 103 డిగ్రీల తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. అయినప్పటికీ, జట్టు కోసం జ్వరం లెక్కచేయకుండా మైదానంలోకి అడుగుపెట్టారు. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జార్జియా వోల్‌తో (79) కలిసి స్మృతి ఆడిన ఇన్నింగ్స్ డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపో...