భారతదేశం, ఆగస్టు 19 -- RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఆర్‌సీ 17' (RC17). ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ అప్‌డేట్స్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Advani) పేరు బలంగా వినిపించింది. అయితే తాజాగా 'ధురంధర్' (Dhurandhar) మూవీతో నేషనల్ సెన్సేషన్‌గా మారిన సారా అర్జున్ (Sara Arjun) ను ఎంపిక చేశారనే టాక్ వైరల్ గా మారింది.

'రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో రాబోతున్న 'ఆర్‌సీ 17' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎంపికపై దర్శకుడు సుకుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. సారా అర్జున్ వైపే ఆయన మొగ్...