భారతదేశం, జూన్ 19 -- Razor OTT: టాలీవుడ్‌లో సరికొత్త ఎక్స్‌పెరిమెంటల్ చిత్రాలకు, గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సీనియర్ దర్శకుడు రవిబాబు. అతను రూపొందించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'రేజర్' (Razor). ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఎట్టకేలకు ఇవాళ (జూన్ 19) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌పై దగ్గుబాటి సురేష్ బాబుతో కలిసి రవిబాబు సంయుక్తంగా నిర్మించిన రేజర్ చిత్రం ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. 2 గంటల 4 నిమిషాల షార్ప్ అండ్ క్రిస్ప్ రన్‌టైమ్‌తో ఉన్న ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ నేటి నుంచి 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది. ఓటీటీ స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది.

​రేజర్ సినిమా గత నెల మే 8న థియేటర్లలో రిలీజ్ అయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ...