భారతదేశం, మార్చి 8 -- టాలీవుడ్‌లో రీసెంట్‌గా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా రాయుడు గారి తాలూకా. ఉలిశెట్టి శ్రీనివాస్ హీరోగా నటించిన రెండో సినిమా ఇది. ఈ మూవీలో ఉలిశెట్టి శ్రీనివాస్‌కు హీరోయిన్‌గా సత్య ఈషా నటించింది. అలాగే, సీనియర్ హీరో సుమన్ కీలక పాత్ర పోషించారు.

వీరితోపాటు కిట్టయ్య, ఆర్కే నాయుడు, ఉలిశెట్టి నాగరాజు, కరణం శ్రీహరి, సృజనక్షిత ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రచయిత, నిర్మాతగా హీరో ఉలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి రాయుడు గారి తాలూకా రివ్యూలో తెలుసుకుందాం.

ఓ గ్రామానికి రాయుడు (ఉలిశెట్టి శ్రీనివాస్) పెద్దగా ఉంటాడు. రాయుడు అంటే చాలా మందికి భయం, మరికొంతమందికి గౌరవం. కానీ, రాయుడు జీవితంలో రహస్యమైన కోణం ఉంటుంది. కూతురు అంటే రాయుడ...