భారతదేశం, ఆగస్టు 22 -- రైలు ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. రాయగడ నుంచి గుంటూరు మార్గంలో ప్రయాణించే డైలీ ఎక్స్‌ప్రెస్ రైలు సమయాల్లో మార్పులు చేసింది. రైలు నంబర్ 17244 రాయగడ - గుంటూరు డైలీ ఎక్స్‌ప్రెస్ వేళలను సవరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కొత్త వేళలు 2026 ఆగస్టు 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

రైలు బయలుదేరే సమయాన్ని 10 నిమిషాలు ముందుకు జరిపినట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. దీనివల్ల ప్రయాణికులు రైలు మిస్ కాకుండా ఉండేందుకు కొత్త టైమింగ్స్‌ను గమనించి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

గుంటూరు మార్గంలో రాయగడకు రాకపోకలు సాగించే వారికి ఈ రైలు అనుకూలంగా ఉంటుంది. ఈ ట్రైన్ మొత్తం 13 గంటల 50 నిమిషాల పాటు ప్రయాణం సాగిస్తుంది. ఏపీ, ఒడిషా రాష్ట్రాల్ని కలిపే ముఖ్యమైన రైలు ఇది. ఈ రైలు ప్రయా...