భారతదేశం, జూలై 1 -- Ravi Teja Sree Vishnu: టాలీవుడ్ లో సరికొత్త కాంబినేషన్లకు ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరు కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే థియేటర్లలో ఆ వినోదాల మజానే వేరుగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఒక సంచలన మల్టీస్టారర్ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్‌లో సర్వం సిద్ధమవుతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), వైవిధ్యభరితమైన పాత్రలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతున్న యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) కలిసి ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబో థియేటర్లను షేక్ చేసేందుకు ఒక్కటి కాబోతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

'రాజ రాజ చోర', 'స్వాగ్' వంటి సినిమాలతో తన మార్క్ విలక్షణమైన కామెడీ, వినూత్న స్క్రీన్‌ప్లేతో...