భారతదేశం, సెప్టెంబర్ 3 -- Telangana Ration Rice Distribution : తెలంగాణలోని రేషన్‌ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న మూడు నెలల రేషన్‌ బియ్యం ఉచిత పంపిణీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఫలితంగా ఇప్పటివరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యం కోటాను తీసుకోలేకపోయిన పేద కుటుంబాలకు పెద్ద ఊరట లభించింది. తాజా ఆదేశాల ప్రకారం.. సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్‌ దుకాణాల్లో ఈ బియ్యం పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగనుంది.

గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలు, వర్షాభావ పరిస్థితులు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధిం...