భారతదేశం, ఏప్రిల్ 3 -- Rashmika Vijay: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి మూవీ రణబాలి (Ranabaali). ఈ సినిమా షూటింగ్ రాయలసీమలోనే చాలా వరకు జరిగింది. దీంతో అక్కడి అభిమానులు, ఆ ప్రాంతంతో తమకు ఏర్పడిన బంధాన్ని గుర్తు చేసుకుంటూ విజయ్, రష్మిక ఒకేసారి ఇన్‌స్టా స్టోరీస్ లో ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు.

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇద్దరూ శుక్రవారం (ఏప్రిల్ 3) ఓ చిన్న వీడియోను తమ ఇన్‌స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశారు. ఇద్దరూ రాయలసీమ మై లవ్.. థ్యాంక్యూ అనే క్యాప్షన్ తో ఈ వీడియోను షేర్ చేయడం విశేషం. సీమ.. మా సీమ అంటూ ఈ వీడియో ప్రారంభమైంది.

ఆ తర్వాత రణబాలి షూటింగ్ కోసం విజయ్, రష్మిక రాయలసీమ వెళ్లినప్పుడు అక్కడ వాళ్లకు లభించిన ఘన స్వాగతం, భారీ పూలమాలలు, ర్యాలీలు, దైవ దర్శనాలను ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాదు రణబాలి షూటింగ్...