భారతదేశం, అక్టోబర్ 23 -- Salman Khan Satires On Rashmika Mandanna Varun Dhawan: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్ర ప్రాణహాని ముప్పు పొంచి ఉన్నప్పటికీ, బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ తన మార్క్ స్టైల్‌ను వీడలేదు. ముంబైలో గురువారం (అక్టోబర్ 22) సాయంత్రం అత్యంత వైభవంగా జరిగిన ఐఫా (IIFA) 2027 అవార్డుల ముందస్తు కార్యక్రమంలో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

చుట్టూ భారీ భద్రతా బలగాలు పహారా కాస్తున్నప్పటికీ, ఏమాత్రం బెరుకు లేకుండా వేదికపై ఇతర సినీ ప్రముఖులతో ఎంతో సరదాగా గడిపారు సల్మాన్ ఖాన్. ఈ వేడుకలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, వరుణ్ ధావన్, కరీనా కపూర్, షాహిద్ కపూర్ వంటి అగ్రతారలు పాల్గొన్నారు.

వచ్చే ఏడాది జరగబోయే ఐఫా వేడుకల్లో తాను మొదటిసారి ప్రదర్శన ఇవ్వబోతున్నానని హీరోయిన్ రష్మిక మందన్నా ఎంతో ఉత్సాహంగా చెప్పారు. "ఇది ఐఫాలో నా తొలి...