భారతదేశం, జూన్ 15 -- Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ క్యూ అండ్ ఏ (Q&A) సెషన్‌లో తన భర్త విజయ్ దేవరకొండ గురించి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అలాగే జూన్ 19న విడుదల కాబోతున్న బాలీవుడ్ మూవీ 'కాక్‌టెయిల్ 2' విశేషాలను కూడా రష్మిక పంచుకుంది.

రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ క్యూ అండ్ ఏలో ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ''మీరు చేసిన సంతోషకరమైన పని ఏది'' అని ఓ అభిమాని ప్రశ్నించారు. దీనికి నవ్వుతూ.. ''నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోవడమే'' అని రష్మిక మందన్న పేర్కొంది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ మాటలు విజయ్ దేవరకొండ వింటే ఎగిరి గంతులేస్తాడేమోనని నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఫిబ్రవరి 2026లో ఉదయ్‌పూర్ వేదికగా విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న తర్వాత రష్మిక సోషల్ మీడియాలో చాలా లిమిటెడ్‌గా ర...